TEJA NEWS TV :
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని రుద్రవరం మండలం అటవీ పరిధిలో ఉన్న తెలుగు గంగ కాలువ ను మంగళవారం నాడు నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా నీటి పారుదల శాఖ ఏఈ ఆర్.రామశేషు మాట్లాడుతూ తెలుగు గంగకు నీరు తక్కువ మోతాదులో రైతులకు అందించడం జరుగుతుందని వెలుగోడు రిజర్వాయర్ నీటిమట్టం తక్కువగా ఉండటం వలన నీటిపారుదల తగ్గించడం జరిగిందని అలాగే రుద్రవరం సమీపంలోని తెలుగు గంగ కాలువ 28,29వ బ్లాకు మరమ్మత్తులు చేయడం జరిగిందని మరమ్మతులను పరిశీలించడానికి మంగళవారం నాడు తెలిపారు అలాగే రైతులు నీరు వృధా కాకుండా నీటిని ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ డి.ఈ.ఈ వి.చంద్రఓబుల రెడ్డి,ఏ.ఈ.ఈ రవీంద్రనాథ్,మరియు ఏ.ఈ.ఈ వర్క్ ఇన్స్పెక్టర్ స్వరాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
రుద్రవరం: అటవీ సమీపంలోని తెలుగు గంగ కాలువను పరిశీలించిన ఉన్నతాధికారులు
RELATED ARTICLES