TEJA NEWS TV :
గత నెల 30 నుండి ఈ నెల 2 వ తారీఖు వరకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం లోని స్టేడియం గ్రౌండ్ లో జరిగిన యస్.జి.ఎఫ్ అండర్ 14 బాల,బాలికల రగ్బీ పోటీలలో మెదక్ జిల్లా మూడవ స్థానం సాధించి కాంస్య పతకం గెలుచుకుందని మెదక్ జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్షుడు కరణం గణేష్ రవికుమార్ తెలిపారు.బాలికల విభాగంలో మూడవ స్థానం కోసం జరిగిన పోటీలలో 15-0 స్కోర్ తేడా తో కరీంనగర్ జట్టుపై గెలవగా,బాలుర విభాగంలో 10-0 స్కోర్ తేడాతో గెలుపొందారని ఆయన తెలిపారు.బాలికల టీమ్ లో కెప్టెన్ లాస్య,కావ్య,ప్రవస్వీ,దేవి,కల్పన,విలక్షణ,శ్రవనభార్గవి, నివేదిత,సాహితీ,శ్రావణి,అనురాధ,ఆశ్విత పాల్గొనగా,బాలుర విభాగంలో కార్తీక్,బాలు,దీక్షిత్,లక్ష్మణ్,నవదీప్,నందు,సాయితేజ,గణేష్,సాయినయన్,శ్రీరామ్,శివకుమార్ పాల్గొన్నారు.బాలికల టీమ్ కోచ్ గా కరణం మల్లీశ్వరి వ్యవహరించగా, మేనేజర్ గా ప్రవీణ్,బాలుర టీమ్ కోచ్ గా శ్రీనాథ్ వ్యవహరించగా మేనేజర్ గా నర్సింలు వ్యవహరించారు.మెదక్ జిల్లా బాల, బాలికల టీమ్ మూడవ స్థానం సాధించడం పట్ల మెదక్,సిద్దిపేట,సంగారెడ్డి జిల్లాల యస్.జి.ఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీలు రమేష్,సౌందర్య,అమూల్యమ్మలు రాష్ట్ర రగ్బీ పోటీల బాలికల టీంకు అబ్సర్వర్ గా వ్యవహరించిన కిష్టయ్య హర్షం వ్యక్తం చేశారు.
రాష్ట్ర స్థాయి యస్.జి. ఎఫ్ అండర్ 14 రగ్బీ బాల,బాలికల పోటీలలో మెదక్ జిల్లాకు మూడవ స్థానం
RELATED ARTICLES