TEJA NEWS TV : ముస్లీం సోదరులు ఎంతో పవిత్రంగా భావించే ‘రంజాన్’ నెల అంటే ‘దానధర్మాలకు ప్రతీక’. సంపాదించిన దానిలో ‘2.5% శాతం’ పేదలకు దానం చేయడాన్ని ‘జకాత్’ అంటారు. రెండున్నర కిలోల గోధుమలు విలువ చేసే నగదును తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ దానంగా ఇచ్చేదాన్ని ‘ఫిత్ర’ అంటారు. ఇలా రంజాన్ మాసంలో ఏ పుణ్య పని చేసిన 70 సార్లు చేసినంత పుణ్యం కలుగుతుందని ఇస్లాం మతవిశ్వాసం…
ఈ మాసంలో నెల రోజుల పాటూ ఎంతో కఠినాత్మకంగా ఉండే ఉపవాస దీక్షలు (రోజ) ప్రతి ఒక్కరికీ పేదల ఆకలిడప్పుల విలువ తెలియజేసి మానవత్వాన్ని పెంపొందించడమే ఇస్లాం ముఖ్యఉద్దేశం…
అలాగే ఉపవాసం ఉంటూ ప్రాపంచికసుఖాలు వదిలివేయటం, బాహ్య ప్రపంచానికి దూరంగా అంతర్గత ఆధ్యాత్మిక ప్రపంచానికి దగ్గరగా చేరుకోవడం భక్తితో ప్రతి ఒక్కరూ మంచివైపు నడిచేలా చేయడమే రంజాన్ లక్ష్యం…
సహేరి, ఇఫ్తార్, జకాత్, ఫిత్రా, యేతికాఫ్, తరావే ఇలా ఎన్నో ప్రత్యేకతో పవిత్ర రంజాన్ మాసం దిగ్విజయంగా ముగించుకుని, ఈదుల్ ఫితర్ పండుగ జరుపుకుంటున్నా.
రాష్ట్ర ముస్లిం సోదర సోదరీమణులకు ఈద్ మబారక్ తెలిపిన Zptc వీరుపాక్షి
RELATED ARTICLES