Thursday, February 6, 2025

రాష్ట్ర జర్నలిస్టు స్పోర్ట్స్ అసోసియేషన్ మా టీవీ ప్రసాద్ కు రోటరీ క్లబ్ తరఫున ఘన సన్మానం

TEJA NEWS TV :రోటరీ క్లబ్ సాధారణ సమావేశం ఆదివారం రోటరీ క్లబ్ సమావేశ మందిరంలో ప్రారంభమైంది అధ్యక్ష కార్యదర్శులు ఉమ్మడి రామకృష్ణారెడ్డి ప్రధాన కార్యదర్శి రత్న రాజు ఆధ్వర్యంలో ఇటీవల రోటరీ మాజీ అధ్యక్షులు పాపి రెడ్డి గారి సతీమణి మృతి చెందారు ఈ సందర్భంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు అనంతరం అధ్యక్షులు రామకృష్ణారెడ్డి రోటరీ క్లబ్ కార్యక్రమాల గురించి వివరించారు అనంతరం రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు దేవిశెట్టి హరీష్ బాబు తిరుపతి తదితర ప్రాంతాల్లో జరిగే రోటరీ క్లబ్ జాతీయ సమావేశాల గురించి క్లుప్తంగా వివరించారు అనంతరం ఆళ్లగడ్డ రోటరీసభ్యులు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు స్పోర్ట్స్ అసోసియేషన్  రాష్ట్ర అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా సీనియర్ పాత్రికేయులు ఓబులం ప్రసాద్  గారిని (మా టీవీ) ఆదివారం నాడు ఆళ్లగడ్డ పట్టణంలోని రోటరీ క్లబ్ భవనం నందు  రోటరీ క్లబ్ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి ప్రధాన కార్యదర్శి రత్నరాజు ప్రముఖ పారిశ్రామికవేత్త రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు టీఎంసీ వేణుగోపాల్ రిటైర్డ్  అధ్యాపకులు శంకర్ రెడ్డి రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు ఉపాధ్యాయులు రామచంద్రారెడ్డి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రోటి క్లబ్ మాజీ అధ్యక్షులు దేవిశెట్టి హరిబాబు శబరి సత్యం బ్యాంకు విశ్రాంత ఉద్యోగి కెవి సుబ్బారెడ్డి మరియు తెలుగు లెక్చరర్ పిచ్చల మల్లేశ్వర్ రెడ్డి  న్యాయవాది సుబ్బారెడ్డి ప్రముఖ డాక్టర్ సుబ్రహ్మణ్యం  సభ్యులు బైసాని రవి ప్రకాష్ ఇతర సభ్యులు ప్రముఖులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు ప్రసంగించారు.  జర్నలిస్టుగా తనను ప్రతి ఒక్కరి ప్రోత్సహించినందుకు అలాగే రాష్ట్ర జర్నలిస్టు స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా రోటరీ క్లబ్ సభ్యులందరూ తనను సన్మానించినందుకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular