TEJA NEWS TV (నంద్యాల జిల్లా )
ఈ నెల 20 వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ విశ్వ భూషణ్ హరి చందన్ పర్యటన ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం పాణ్యం మండలంలోని నెరవాడ మెట్ట వద్ద ఉన్న ఏపీ గిరిజన బాలికల పాఠశాలలో గవర్నర్ పర్యటన ఏర్పాట్లను జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డితో కలిసి పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ మాట్లాడుతూ రాష్ట్ర గవర్నర్ విశ్వ భూషణ్ హరి చందన్ ఈ నెల 20 వ తేదీ రాష్ట్ర గవర్నర్ విశ్వ భూషణ్ హరి చందన్ పర్యటన ఏర్పాట్లలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.కార్యాచరణ ప్రణాళిక ప్రకారం గిరిజనులతో గవర్నర్ ముఖాముఖి కార్యక్రమం స్పష్టంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ ముఖాముఖి కార్యక్రమంలో దాదాపు 1500 మంది గిరిజనులు పాల్గొననున్నారని ఈ మేరకు మహిళలు, పురుషులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు మీడియా గ్యాలరీ కూడా ఏర్పాటు చేసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రహదారుల మరమ్మతులు, మైదానం చదును, విద్యుత్ సరఫరా, గ్రీనరీ ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. సభా వేదికతో పాటు గ్రీన్ రూమ్, సేఫ్ రూమ్, గిరిజన సంప్రదాయ స్టాళ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఐటిడిఏ అధికారులను ఆదేశించారు. ఐటిడిఏ, డిఆర్డిఏ, ఇతర సంక్షేమ పథకాల లబ్దిని గిరిజన లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి. నిశాంతి, డిఆర్ఓ పుల్లయ్య, అడిషనల్ ఎస్పి రమణ,ఆర్డీవో శ్రీనివాసులు, డీఎస్పీ మహేశ్వరెడ్డి సంబందిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.