Thursday, January 8, 2026

రాళ్లపల్లిలో అదమరిస్తే ప్రాణాలు గాలిలోకి..
చేతికందే ఎత్తులో విద్యుత్ వైర్లు..
మునగ చెట్టే విద్యుత్ స్తంభం.
.అయోమయ స్థితిలో కాలనీవాసులు…
పట్టించుకోని విద్యుత్ అధికారులు..

TEJANEWSTV
శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండల పరిధిలోని రాళ్లపల్లి గ్రామంలోని బీసీ కాలనీలో గత కొన్ని నెలలుగా గ్రామానికి వీధిలైట్లకు సరఫరా చేసే విద్యుత్ తీగకు స్తంభాలు లేక పోవడంతో విద్యుత్ అధికారులు చేతికంటే ఎత్తులో ఉన్న ఓ మునగ చెట్టుకు విద్యుత్ వైరును చుట్టి ఆ కాలనీలో విద్యుత్ దీపాలు వెలిగించడానికి చేతికoదే ఎత్తులో విద్యుత్ తీగను లాగి ఓ చిన్న కట్టెను దానికి సపోర్టుగా నిలబెట్టారు దీంతో ఏ సమయంలో ఏం జరుగుతుందోనని తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఆ కాలనీవాసులు కాలం వెళ్ళబుస్తున్నారు. తాగుబోతు రాయుళ్లు రాత్రి వేళలో తాగిన మైకంలో పైకి చేతులెత్తితే కచ్చితంగా వారి ప్రాణాలు గాలిలో కలిసి పోవాల్సిందే. ఇదేగాక వర్షాకాలం వస్తే మునగ చెట్టుకు చుట్టిన విద్యుత్ తీగ అర్తుకు గురైతే దాన్ని తాకిన చిన్న పిల్లల ప్రాణాలు కూడా గాలిలో కలిసి పోవాల్సిందే ఈ కాలనీలో అభద్రతాభావంతో ఉన్న విద్యుత్ తీగ విషయమై సంబంధిత విద్యుత్ అధికారులకు ఆ కాలనీ బస్సులు ఎన్నిసార్లు విన్నవించిన వారు పట్టించుకోవడంలేదని కల్లి బుల్లి మాటలు చెప్పి స్తంభాలు స్టాక్ లేవని స్తంభాలు వచ్చిన తర్వాత తాము విద్యుత్ వైరు లాగిస్తామని కథలు చెప్పి విద్యుత్ అధికారులు తప్పించుకోవడానికి చూస్తున్నారని ఆ విద్యుత్ వైరుకు చుట్టుపక్కల ఉన్న కుటుంబాలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాలాన్ని గడుపాల్సి వచ్చిందని విద్యుత్తు వైరుకు చుట్టుపక్కల ఉన్న మహిళలు ప్రజలు యువకులు వృద్ధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రాళ్లపల్లి బీసీ కాలనీలో చేతికందే ఎత్తులో ఉన్న విద్యుత్ వైరుకు స్తంభాలు వేయించి ప్రజల ప్రాణాలు గాలిలోకి కలిసే ముందే విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి విద్యుత్ తీగలు లాగాలని ఆ కాలనీవాసులు కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular