మండలంలో వేడెక్కిన రాజకీయం.
రాజకీయాల్లోకి దళితుడు నో ఎంట్రీ.
పెనుముప్పుల మారిన యూత్ అధ్యక్ష పదవి.
మండలంలో ఇంకా కుల పిచ్చి బీజాలు.
దళితుడి పోటీపై అంతర్గతంగా వ్యూహరచనలు.
వార్తని ప్రచురించిన విలేకరి పై కారాలు మీరాలు టార్గెట్లట.
దళితులపై ఎందుకింత దమన కాండ.?
ములుగు జిల్లా వెంకటాపురం మండలం లో
జరగబోయే యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి వెంకటాపురం మండల రాజకీయం సన్నద్ధమైంది. నువ్వా నేనా అన్నట్టుగా యూత్ ప్రెసిడెంట్ పదవి కోసం ఎవరికి వారు వ్యూహాలు రచించుకుంటునారు. ఎక్కడ చూసినా ఒకటే చర్చ, యూత్ నాయకుడి ఓటింగ్ విషయంలో అధిష్టానం ఆశీస్సులు మాకు ఉన్నాయంటూ కొందరు, మండల నాయకులు నాకే సపోర్ట్ ఉన్నారని మరికొందరు, నియోజకవర్గ ఎమ్మెల్యే సపోర్ట్ మాకే అంటూ ఇంకొందరు, విస్తృతంగా వాట్సప్ గ్రూపుల్లో సైతం తెగ ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉండగా 60 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఒక చైతన్యత్మక నామినేషన్ జరిగింది. మండల కాంగ్రెస్ అధ్యక్షుడి ప్రోత్సాహంతో యూత్ అధ్యక్ష పదవికి ఒక దళితుడు రావుల నాని నామినేషన్ వేశారు. ఈ పరిణామం తో మండల కాంగ్రెస్ లో ప్రకంపనలు చెలరేగుతున్నాయి. దళితుడు పోటీ చేయడమేమిటి అని అంతర్గతంగా అతని ఓటమే ధ్యేయంగా పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు మండల అధ్యక్షుడు పై,రావుల నాని పై వ్యూహాలు ప్రతి వ్యూహాలు పన్నుతున్నారని మండల ప్రజలు గుసగుసలాడుతున్నారు. వ్యూహoలో భాగంగా రావుల నానికి ఎగస్ పార్టీగా పలు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల బంధువులను నామినేషన్ వేయించారని మండలమంతా కోడై కూస్తుంది. అసలు రావుల నాని పోటీపై సీనియర్ నాయకులు ఎందుకు భయపడుతున్నారు అని విశ్లేషించగా గతంలో మండల కాంగ్రెస్ పార్టీని హస్తగతం చేసుకొని ఏక చక్రాధిపతిగా చక్రం తిప్పిన కొంతమంది సీనియర్ నాయకులకు మరల అంతటి వైభవం రావుల నాని పోటీ చేస్తే వస్తదో రాదో అనే ఉద్దేశంతో రావుల నానికి ఉన్న యూత్ ఫాలోయింగ్ మీద దెబ్బ కొట్టేలా యువజన కార్యకర్తలను సమన్వయం చేసి ఏకగ్రీవ ఎన్నిక జరిగేలా వ్యూహం పన్ని ప్రజలలో వారు నిలబెట్టిన వ్యక్తి యూత్ ప్రెసిడెంట్ అని అపోహలు ప్రజలలో గుప్పించి రావుల నాని రాజకీయ భవిష్యత్తు మీద దెబ్బ కొట్టే ప్రయత్నం చేశారనీ ప్రచారం జరుగుతోంది.ఇదంతా అసెంబ్లీ ఎన్నికలలో వివిధ పార్టీలలో నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన నాయకుల వల్ల ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయని ,వారి వల్ల పార్టీ సమతుల్యం తప్పిందని, ఎవరికి వారే పార్టీని తమ భుజాలపై మోస్తున్నాము అన్నట్టుగా వ్యవహరిస్తు, ఇప్పుడున్న మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పై అనేక ఆరోపణలు మోపడానికి కసరత్తులు కూడా చేస్తున్నట్టుగా ఆరోపణలు తలెత్తుతున్నాయి. మొదటిసారిగా ఒక దళితుడిని ప్రోత్సహించిన మండల కాంగ్రెస్ అధ్యక్షుడికి ప్రజా బలం ఎక్కువ ఉన్నప్పటికీ సీనియర్ నాయకులే అధ్యక్షుడిపై బురదజల్లే ప్రయత్నం చేస్తుంటే ఐక్యత లోపించిన నాయకత్వం,పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుందా? అనే సందేహాలు కూడా లేకపోలేదు. జరుగుతున్న పరిణామాలను ప్రచురించిన విలేఖరి పై కొంతమంది నాయకులుటార్గెట్లు పెడుతున్నారంటే వారి ఆలోచన ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏదిఏమైనాప్పటికీ మండల రాజకీయం కాస్త గాడి తప్పుతుంది అనే సంకేతాలు పార్టీ బలోపేతానికి అంత మంచిది కాదు అని రాజకీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.