భద్రాచలంలోని రోడ్ల మీదకి వ్యాపారాలు దూసుకొస్తున్న అధికారులకు మాత్రం ఎవరు కనపడడం లేదు అన్నట్లే ప్రవర్తిస్తున్నారు. రహదారులు పెద్దగా అయితే అదే రహదారుల రోడ్లమీద వ్యాపారాలు కూడా పెద్దగా పెట్టుకోవచ్చని అనుకుంటున్నారు కాబోలు, ఇలా రహదారి మీద వ్యాపారలు రావడం వల్ల రోడ్డు వెడల్పు తగ్గి ప్రయాణికులకు భారీ వాహనాలకు మోటర్ వాహనాలకు ఇబ్బంది కలుగుతుంది. తద్వారా వ్యాపారం దగ్గర ఉండే జనాలు వల్ల ప్రమాదలు జరుగుతూన్నాయి, వారి వల్ల ప్రమాదాలకు గురైన ఎన్నో కుటుంబాలు అదే రోడ్ల పాలవుతున్నారు… అసలే భద్రాచలం రోడ్లు మూడు గుంతలు ఆరు అతుకులు లాగా ఉంటుంది అలాంటి రోడ్లమీద ఇలా వ్యాపారాలు పెట్టడం వల్ల పెద్ద స్థాయి ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే భద్రాచలం మొత్తం ఫూట్ పాత్ ఆక్రమించి కట్టుకున్న షాపులను అలాగే బడ్డీలను అలాగే ఉన్న వ్యాపారాలన్నిటిని తొలగించి వారి మరో ప్రదేశంలో చిరు వ్యాపారస్తులు మార్కెట్ మరియు ఫ్రూట్స్ & స్ట్రీట్ ఫుడ్ మార్కెట్ ఏర్పాటు చేయాలి అని కోరుతున్నాము… అలాగే పాదచారలకు ఫుట్ పాత్ మీద నడిచే సౌకర్యం కల్పించాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రమాదాలు జరగకముందే జాగ్రత్త పడితే మంచిది అని భావిస్తున్నాం. ఈ కార్యక్రమంలో *జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యులు బనవత్.వంశీ తేజ , గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి , గుగులోతు బాబు , పొడుతూరి ప్రేమ్ సాయి , నక్క సాయి బాబు పాల్గొన్నారు.
రహదారి మీద వ్యాపారం… చర్యలేవి అధికారి యంత్రాంగం….?
RELATED ARTICLES