తేజ న్యూస్ :-హొళగుంద
తుంగభద్ర డ్యామ్ నుండి ఆంధ్ర వాట కు వచ్చే ఎల్ ఎల్ సి కాలువ నీరు రబీ పంటలకు సాగు, తాగు నీరు ఇవ్వలని రైతు సంఘం నాయకుడు తప్పేట రామిరెడ్డి గురువారం డిమాండ్ చేశారు. బళ్లారి లోని టీబీపీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం వద్ద రైతులతో కలిసి మాట్లాడుతూ ఇప్పటికే కురుసిన అధిక వర్షాలకు ఖరీఫ్ పంట దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్ట పోయారని అన్నారు. దింతో పాటు రబీ పంటకు తుంగభద్ర బోర్డు అధికారులు ఆంధ్ర వాటకు ఇవ్వాల్సిన నీరు ఇవ్వకపోతే రైతులు తీవ్రంగా నష్ట పోతారని వాపోయారు. అనంతరం తుంగభద్ర బోర్డు ఎస్ ఈ నారాయణ నాయక్ కు దృష్టికి తీసుకోవేళ్లగా నవంబర్ 7 వతేది తుంగభద్ర బోర్డు అధికారుల సమావేశంలో రబీ పంటకు ఆంధ్రకు సాగు, తాగు నీరు అందించే విషయం పై బోర్డు ఉన్నత అధికారులతో చర్చలు జరిపి ఓ నిర్ణయం తీసుకోబోతునట్లు తెలిపారు. అనంతరం ఎస్ ఈ కు ఓ వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక రైతు సంఘం నాయకులు శరణ గౌడ, ఆంధ్ర రైతులు రమేష్ రెడ్డి, కురువ కాళికా ప్రసాద్, క్రి ష్ణయ్య, మిక్కిలి నేని మహేష్, కాకి సీతయ్య, కాకి పక్కిరప్ప, దిడ్డి వెంకటేష్,, దుబ్బ ఎర్రిస్వామి మరియు రైతులు పాల్గొన్నారు.






