భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
కొత్తగూడెం :
ప్రముఖ పారిశ్రామికవేత్త, భారతరత్న రతన్ టాటా దేశానికి చేసిన సేవలు మరువలేనివని కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ కొనియాడారు.
కొత్తగూడెంలోని టాటా ఏఐఏ బ్రాంచ్ లో రతన్ టాటా 88వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ ముఖ్య అతిథిగా హాజరై, కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. రతన్ టాటా వంటి మహోన్నత వ్యక్తి భారతదేశంలో జన్మించడం మనందరి అదృష్టమని పేర్కొన్నారు. కేవలం వ్యాపారవేత్తగానే కాకుండా, తన సంపాదనలో సింహభాగాన్ని సేవా కార్యక్రమాలకు వెచ్చించి కోట్లాది మందికి ఆదర్శంగా నిలిచారని ఆయన గుర్తు చేశారు. లాభాల కంటే విలువలకే ప్రాధాన్యతనిచ్చిన గొప్ప మానవతా వాది రతన్ టాటా అని అన్నారు.
భారత పారిశ్రామిక రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో ఆయన కృషి అనన్యం అని పేర్కొన్నారు. యువత ఆయన అడుగుజాడల్లో నడిచి దేశాభివృద్ధికి తోడ్పడాలనీ పిలుపునిచ్చారు. అనంతరం లీడర్లు, అడ్వైసర్లు 50 మందికి పైగా రక్త దానం చేశారు. రక్త దాతలను డీఎస్పీ అభినందిస్తూ వారికి సర్టిఫికేట్ ను అందించారు. ఈ కార్యక్రమంలో టాటా ఏఐఏ బ్రాంచ్ మేనేజర్ జక్కుల సతీష్, బామ్ రాహుల్ వెంకటేష్, లీడర్లు సీబీఎ నాగేందర్రెడ్డి, నవీన్ రెడ్డి, నాగలక్ష్మీ ,అనిల్, శివ లీలా,ఆనంద్, ఏ దివ్య,జె దివ్య, సునీత, కృష్ణ, వంశీ, ప్రసాద్,జంపన్న, అమ్ములు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.
రతన్ టాటా 88వ జయంతి వేడుకలు ఘనం: కొనియాడిన డి.ఎస్.పి అబ్దుల్ రెహమాన్
RELATED ARTICLES



