బీబీపేట్ : మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఆయన నియమితులైన నేపథ్యంలో బీబీపేట మండల యూత్ అధ్యక్షుడు మల్లుగారి మహేష్ సోమవారం రోజున హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిశారు. అనంతరం శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ, దేశ రాజకీయాల్లో యువత కీలక పాత్ర పోషించాల్సిన సమయం వచ్చిందని, ప్రజాస్వామ్య వ్యవస్థలో వచ్చిన మార్పులను యువత సానుకూల దృక్కోణంతో అర్థం చేసుకుని నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యువత కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ అధ్యక్షుడు పరకాల రవి, సీరి బీబీపేట్ ప్రెసిడెంట్ నాగరాజు, జనగామ యూత్ ప్రెసిడెంట్ ప్రవీణ్, ఇసనగర్ యూత్ ప్రెసిడెంట్ కనకరాజు పాల్గొన్నారు.
యువత రాజకీయాల్లోకి రావాలి: టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి
RELATED ARTICLES