శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలం మోరుబాగల్ గ్రామంలో అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం 2023 కార్యక్రమం మండల వ్యవసాయ శాఖ అధికారి తిమ్మప్ప ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు శ్రీ రమణారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి వై.వి. సుబ్బారావు గారు, జిల్లా వనరుల కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ సనావుల్లా గారు, విద్యావతి గారు, మడకశిర డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీ కృష్ణ మీనన్ గారు పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి గారు మాట్లాడుతూ ఖరీఫ్ 2023 సంవత్సరంలో 250 ఎకరాలలో క్లస్టర్ స్థాయి ప్రదర్శనక్షేత్రాలు రాగి పంటలో నిర్వహిస్తున్నామని రైతులను పంట విత్తె దగ్గర నుండి కోత వరకు చేపట్టవలసిన వ్యవసాయ పనులపై సాంకేతిక సూచనలు ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే చిరుధాన్యాలు ఆహారంగా తీసుకోవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరించడం జరిగింది. జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు రమణారెడ్డి మాట్లాడుతూ,చిరుధాన్యాల వలన కలిగే ఉపయోగాలు గురించి వివరించారు.
అనంతరం ర్యాలీ నిర్వహించి గ్రామ ప్రజలకు చిరుధాన్యాల ఆహారంగా తీసుకుంటే కలిగే లాభాలపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి తిమ్మప్ప, మార్కెట్ యార్డ్ చైర్మన్ జయ రామప్ప, జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు హనుమంత రెడ్డి, మండల వ్యవ సాయ సలహా మండలి అధ్యక్షులు వడ్గేరప్ప, సభ్యులు రాజశేఖర్, రైతు భరోసా కేంద్రం సిబ్బంది, ప్రకృతి సేద్యం సిబ్బంది, ఏపీ మాస్ స్వచ్ఛంద సంస్థ సిబ్బంది అనిల్, మరియు రైతులు పాల్గొన్నారు
మోరుబాగల్ గ్రామంలో అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం 2023 కార్యక్రమం
RELATED ARTICLES