తేజ న్యూస్ టివి ప్రతినిధి, సంగెం
సంగెం మండలానికి చెందిన బీజేపీ నాయకుడు మేదరి స్వాగత్ ఇటీవల గుండెపోటుతో ఆకస్మికంగా మరణించిన విషయం తెలుసుకొని నివాసానికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి, వారికి భరోసా కల్పించి, కుటుంబానికి అండగా ఉంటానని భరోసా కల్పించిన *బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి *, మేదరి స్వాగత్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
అలాగే అదే గ్రామానికి చెందిన అయ్యగారు అప్పే నాగేశ్వర ప్రసాద్ శర్మ గుండెపోటుతో మరణించిన సందర్భంగాను, వారి కుటుంబ సభ్యులను డా. విజయచందర్ రెడ్డి పరామర్శించి సంతాపం చెప్పారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దామరప్పుల చంద్రమౌళి, మండల ప్రధాన కార్యదర్శిలు శ్యామ్,పవన్ సాయి, జిల్లా కౌన్సిల్ సభ్యులు బుట్టి కుమారస్వామి,మొలుగూరి శ్రీనివాస్, వడ్డే దేవేందర్ రెడ్డి, ములక ప్రసాద్, గోనె ముకుందం,పెండ్లి రమేష్, జక్క చేరాలు, సమ్మిరెడ్డి, నరసయ్య , నరేష్ మరియు ఇతర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
