తేజ న్యూస్ టివి ప్రతినిధి, సంగెం.
సంగెం మండలం బిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు మొండ్రాయి గ్రామ వాస్తవ్యులు పెండ్లి పురుషోత్తం రెడ్డి తల్లి మాజీ సర్పంచ్ పెండ్లి కొమురమ్మ శనివారం రోజు ఉదయం మరణించగా విషయం తెలిసిన వెంటనే పరకాల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆమె పార్థీవ దేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం అంతిమ యాత్రలో పాల్గొన్నారు.
ఆయన వెంట పరామర్శించిన వారిలో నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి,మాజీ జడ్పీటీసీ గూడ సుదర్శన్ రెడ్డి, మండల బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు ఉన్నారు.
