TEJA NEWS TV :
అల్లా అనుగ్రహం అందరకీ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను
అత్యంత నిష్ఠతో పవిత్ర రంజాన్ మాస ఉపవాస దీక్షలను ముగించుకుని, జరుపుకుంటున్న పండుగే రంజాన్
మంత్రి క్యాంపు కార్యాలయంలో పలువురు ముస్లిం సోదరులు మంత్రి కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఆలూరు తేజ న్యూస్ టీవీ
ఈ రోజు ఉదయం ఆలూరు పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నందు *హోళగుంద మండలం,ఎల్లార్తి గ్రామానికి చెందిన పలువురు ముస్లిం సోదరులు మరియు ఎల్లార్తి మల్లికార్జున తదితరులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ గుమ్మనూరు జయరాం గారిని కలిసినారు* ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ నెల రోజులు పాటు అత్యంత నిష్ఠతో పవిత్ర రంజాన్ మాస ఉపవాస దీక్షలను ముగించుకుని,జరుపుకుంటున్న పవిత్రమైన పండుగ రంజాన్ పండుగ అని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ మరియు ఆలూరు నియోజకవర్గ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక అని మంత్రి గుమ్మనూరు అన్నారు.ముస్లిం సోదరులు చేసే ప్రార్థనలు సఫలం కావాలని, అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు మరియు ఆలూరు నియోజకవర్గ ప్రజలకు సకల శుభాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు.
మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని,ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ అని మంత్రి గుమ్మనూరు తెలిపారు.
ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర కార్మిక మంత్రి గుమ్మనూరు జయరాం
RELATED ARTICLES