మల్కాపూర్ గ్రామంలో ముస్లిం సోదరులకు సంబంధించిన పంపు మోటార్ పనిచేయక దాదాపు నెలరోజులు అవుతుంది ఏం చేయాలో అర్థం కాక బాధపడుతున్న సమయంలో బిబిపేట్ మండల కో ఆప్షన్ మేంబర్ మహమ్మద్ ఆసిఫ్ గారికి చెప్పగా వారి మిత్రుడు మల్కాపూర్ నివాసి సిరిగాధ స్వామి S/శంకరయ్య గారికి ఫోన్ చేయగా వెంటనే స్పందించి 3hp పంపు మోటార్ ఇవ్వడం జరిగింది సిరిగాధ స్వామి గారు పంపు మోటారు ఇచ్చినందుకు ముస్లిం కుటుంబాలు సంతోషం వ్యక్తం చేశారు మహమ్మద్ ఆసిఫ్ గారు మాట్లాడుతూ అడిగిన వెంటనే పంపు మోటార్ ఇచ్చినందుకు సిరిగాధ స్వామి S/ శంకరయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడే కాదు గతంలో కూడా మల్కాపూర్ గ్రామానికి తన వంతు సహాయంగా పంపు మోటారు ఇవ్వడం జరిగిందని తన పుట్టిన గ్రామానికి తన వంతు సహాయం చేస్తున్న మిత్రుడు సిరిగాధ స్వామికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో రంజిత్ కుమార్ ముస్లిం కమిటీ అధ్యక్షులు సయ్యద్ కాలు సయ్యద్ బాబు తదితరులు పాల్గొన్నారు