Wednesday, February 5, 2025

ములుగు జిల్లా :స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో మండల కాంగ్రెస్ నాయకులు అతిఉత్సాహం

ఏది దేశభక్తి.

అడవిలో ఉండే వీళ్ళదా.?

రాజకీయం చేసే వాళ్లదా.?

తిరంగా జండాను తొక్కిన నోరు మెదపరా?.

జండా దిమ్మలను తొక్కిన వారిపై చర్యలు లేనట్టేనా?

ఈ విషయంలోజిల్లా ఎస్పీ  వివరణ ఏంటి?

ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలలో మండల కాంగ్రెస్ నాయకులు అతిఉత్సాహం ప్రదర్శించారు. ఎంతోమంది ప్రాణ త్యాగాలకు ప్రతీకగా ఏర్పడిన జెండాను  జండా అమర్చబడే  రంగులతో కూడిన దిమ్మలను ఎక్కి తొక్కతూ, పోలెక్కి మరి  అమర్చారు, ఇది భారత రాజ్యాంగంలో యాక్ట్ నంబర్ 69, 1971 ప్రకారం జాతీయ జెండాని తొక్కిన, దానిపైన ఏమైనా రాసిన,జెండాకు మాత్రమేఅవమానం కాదు, భారతదేశానికి అవమానమని పేర్కొంది, అంతేకాకుండా సంవత్సరం పాటు జైలు శిక్ష అని సెక్షన్ వన్,టు కింద తెలుపబడి ఉంది , ఇవేమీ పట్టనట్టు కొంతమంది మండల కాంగ్రెస్ నాయకులు . జెండా మీద  ఎక్కి తొక్కుతూ  అవమానిస్తుంటే,  చర్యలు తీసుకోవాల్సిన అధికారులు జండా అమర్చడానికి ఎక్కిన వ్యక్తిని చూసి చప్పట్లు కొడుతూ జెండా రంగులతో ఉన్న దిమ్మను ఎక్కిన  విషయాన్ని మరిచిపోయారు,
అన్ని తెలిసిన రాజకీయ నాయకులు జెండా దిమ్మలను తొక్కుతూ   కించపరుస్తూ ఉంటే  మరోవైపు  అడవి బిడ్డలు మాత్రం జాతీయ పతాకానికి పెద్దపీట వేశారు. నేతాజీ పిలుపుమేరకు రక్తం ఇవ్వండి దేశాన్ని మీ చేతిలో పెడతా అన్న వెంటనే దేశం కోసం సైనికుల్లా మారిన   పౌరుల రక్తం ఇంకా ఉన్నది అనిపించేలా చతిస్గడ్ అడవుల్లో కంక బొంగులకు జెండా కట్టి ఎగరవేసిన  అడవి బిడ్డల దేశభక్తి మరో మాట లేకుండా దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయులు పసిపిల్లల రూపంలో ఇంకా బతికే ఉన్నారు అనేలా చేస్తోంది .చాతినిండా దేశభక్తితో రొమ్ము విరిచి  సెల్యూట్ కొడుతున్న తీరు ఈ సో కాల్ రాజకీయ నాయకులను సైతం ముక్కు మీద వేలు వేసుకునేలా చేస్తున్నాయి. వారి దిగంబర స్థితిని కూడా మర్చిపోయి జెండా ఎగరవేసిన తీరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో ఎక్కించాలి అంటూ పలువురు అభిప్రాయపడ్డారు. పసి పిల్లల ప్రదర్శన   చేసిన విధానం ప్రజాప్రతినిధులకు సైతం చెంపపెట్టుల  మారింది..
జెండా ఏలా ఎగరవేయాలి, దాని ప్రత్యేకత ఏంటి అనే విషయాలు నాగరికత తెలిసిన వారి కంటే అభం శుభం తెలియని పసిపిల్లలకే ఎక్కువ తెలుసు అనే విధంగా పిల్లలు ఇచ్చిన  సంకేతాలు వారిపై సర్వత్ర ప్రశంసల వర్షం గుప్పిస్తున్నాయి. ఇదిలా ఉండగా మండలంలో జెండాను తొక్కుకుంటూ వెళ్లి అమర్చిన నాయకులను వారు జండా జెండాను కించపరిచిన విధానంపై  జిల్లా ఎస్పీ స్పందించి  వారిపై కఠిన చర్యలు  తీసుకోవాలని యావత్ సమాజం కోరుకుంటుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular