Friday, November 7, 2025

ముదిరాజ్ మహిళల చైతన్యం తోనే రాజ్యాధికారం -జిల్లాఅధ్యక్షులుడాక్టర్ బట్టు విఠల్.ముదిరాజ్

ముదిరాజ్, మహిళల చైత్యన్యంతోనే రాజ్యాధికారంలో వాటా సాధ్యమని కామారెడ్డి జిల్లా ముదిరాజ్ మహాసభఅధ్యక్షులు డాక్టర్ బట్టు విఠల్ ముదిరాజ్ అన్నారు* . ఎల్లారెడ్డి మండల కేంద్రంలో జరిగిన “ముదిరాజ్ మహాసభమహిళా శక్తి సంఘం” సమావేశంలో ఆయన,మాట్లాడారు. గ్రామీణ ప్రాంతంలోని ముదిరాజ్ మహిళలు,రాజకీయ చైతన్యం పొందితేనే తెలంగాణ రాష్ట్రం లో ముదిరాజ్ జాతికి,రాజ్యాధికారం సాధ్యమని డాక్టర్ విఠల్ ముదిరాజ్,అన్నారు.జాతి,సంస్కృతి,పోరాటం స్ఫూర్తిని ఆయన వివరించారు. జాతి చరిత్రలో మహిళల భాగస్వామ్యం గూర్చివివరించారు.విరోచిత పోరాటాలకు జాతి మహిళ మణులు నాయుకత్వం వహించారన్నారు చరిత్ర హినూలు గా మరద్దంటే జాతి సాంస్కృతిక సామాజిక, ఆర్ధిక రాజకీయ ధర్మ పోరాట యుద్ధం లోభాగస్వాములుగా వుండాలని పిలువు నిచ్చారు. ఇందుకు,ముదిరాజ్ మహసభ నిరంతరంగా మహిళా శక్తి సంఘాల”ను గ్రామ గ్రామాన ఏర్పాటుచేస్తున్నామని తెలిపారు. మహిళ జాతికి రాజ్యాంగం ప్రకారంరావాల్సిన ఆర్ధిక,సమానమైన విద్యహక్కు, రాజకీయ హక్కు ఉద్యోగం ఉపాది లతో పాటు “ఓటు హక్కు” విలువను తెలుసుకొనేలా చైతన్యం,కల్గిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాబోయే స్థానిక సంస్థలఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలలో తమ బలాన్ని,బలగన్ని, తెలివినిప్రదర్శించి జాతి బిడ్డలనే, గెలిపించుకోవాలని కోరారు. రాబోయే తరాలకు నేటి ముదిరాజ్ మహిళలే ఆదర్శనంగా నిలవాలని కోరారు.
మహిళసంఘాలలో ఉన్నా మన జాతి మహిళలు నాయకురాలు గా  రానించాలని సూచించారు.
మహిళ,సంఘాలల్లో ఆర్ధిక ప్రగతికి, సంబందించిన అనేక పథకాలు అమలులో ఉన్నాయని వివరించారు.
గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు నాయకత్వలను ఛేజిక్కించుకోవాలని వివరించారు
మహిళలు ముందుండి నాయకత్వం వహిస్తే జాతికి ప్రభుత్వంలో మార్పు కల్గి జాతికి మేలు జరుగుతుందన్నారు.నేటి,పరిస్థితులను బట్టి మహిళల నాయకత్వం అనివార్యమని జిల్లా అధ్యక్షులు డాక్టర్ బట్టు విఠల్ ముదిరాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి. కొరివి నర్సింలు  బిబిపేట్ మండల్ చెందిన మాట్లాడుతూముదిరాజ్,తెలిపారు ఈ కార్యక్రమంలో మండల మహా సభ అధ్యక్షురాలు జ్యోతి ముదిరాజ్, గ్రామఅధ్యక్షురాలు,పోచవ్వముదిరాజ్,స్వప్నముదిరాజ్,రామక్కముదిరాజ్ బాలమణి ముదిరాజ్,హరిత ముదిరాజ్ కీర్తన ముదిరాజ్ ఎలారెడ్డి మండల అధ్యక్షులు ప్యాలల రాములు ముదిరాజ్, నాగిరెడ్దిపేట మండల,అధ్యక్షులు బాలయ్య ముదిరాజ్, జిల్లా నాయకులు సంతోష్ ముదిరాజ్,తదితరులుపాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular