వ్యక్తుల కన్నా యూనియన్ గొప్పది
రాష్ట్ర ఎపిడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్యామసుందర్ లాల్
-ముగ్గురి సభ్యత్వం రద్దు
వ్యక్తుల కన్నా యూనియన్ గొప్పదని ఎపియుడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఖండే శ్యామసుందర్ లాల్ అన్నారు. మంగళవారం రామకృష్ణ పిజి కళాశాలలో నంద్యాల జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. నంద్యాల జిల్లా ఎపియుడబ్ల్యూజే అధ్యక్షులు మధుబాబు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో శ్యామసుందర్ లాల్ మాట్లాడుతూ నంద్యాల జిల్లాలోని నియోజకవర్గాల్లో ఎపియుడబ్ల్యూజే కార్యాలయాల కోసం ఆయా ఎమ్మెల్యేలను కోరాలన్నారు. కోవెలకుంట్ల ఎపియుడబ్ల్యూజే భవనం అంశాన్ని మంత్రి బిసి జనార్థన్రెడ్డితో మాట్లాడామన్నారు. వచ్చే నెల ఒంగోలులో రాష్ట్ర మహాసభలు
జరుగనున్నాయన్నారు. పాత్రికేయుల పిల్లలకు ఫీజు రాయితీల కోసం డిఇఓ జనార్థన్ రెడ్డి జారీ చేసిన ప్రొసెడింగ్స్ కొన్ని చోట్ల అమలు కాలేదని గుర్తు చేశారు. కలెక్టర్ గణియా రాజకుమారి ఇందుకు సానుకూలంగా స్పందించినా డిఇఓ యాజమాన్యాలు సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఫీజు రాయితీ ఇవ్వాలని ఆదేశించడంతో కొన్ని యాజమాన్యాలు ఫీజు రాయితీని ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని 20 జిల్లాలకు పైగా ఆయా డిఇఓలు 50 నుంచి 60 శాతం రాయితీ ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసిన
విషయాన్ని గుర్తు చేశారు. జిల్లాలో కొందరు యూనియన్ సభ్యులు యూనియన్ తోపాటు యూనియన్ పెద్దలను, కమిటి పెద్దలను తరచూ తీవ్ర పదజాలాన్ని ప్రస్థావించడాన్ని రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు దృష్టికి తీసుకొని వెళ్లామన్నారు. జిల్లా కమిటి సమావేశంలో క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు. రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల మేరకు నంద్యాల జిల్లాలోని విజయ్, చంటి, రంగల సభ్యత్వాన్ని రద్దు చేస్తూ సమావేశం తీర్మాణించింది. భవిష్యత్తులో యూనియన్ తోపాటు యూనియన్ పెద్దల పట్ల వ్యతిరేక వ్యాఖ్యలు చేసే వారిపై క్రమశిక్షణా చర్యలు తప్పవన్నారు.
ముగ్గురి సభ్యత్వం రద్దు
RELATED ARTICLES