భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీఎం కప్ 2024 పోటీలలో భాగంగా జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్, ఆదేశాలతో జిల్లా యువజన క్రీడల అధికారి పరదామ రెడ్డి, అధ్యక్షతన సీనియర్ బాస్కెట్ బాల్ క్రీడాకారులు జాన్సన్ డేవిడ్ (బాబు) మనీ నాయుడు, ఆధ్వర్యంలో కొత్తగూడెం ప్రగతి మైదానంలో జిల్లా బాస్కెట్ బాల్ పోటీలు నిర్వహించి, సీఎం కప్ 2024 రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ పోటీలో పాల్గొనే జిల్లా బాస్కెట్ బాల్ పురుషుల, స్త్రీల జట్లను ఎంపికలు చేసినట్లు తెలిపారు. ఈ జిల్లా పోటీలకు గాను జిల్లా నలుమూలల నుండి సుమారు 120 బాస్కెట్ బాల్ క్రీడాకారులు పాల్గొన్నారు. వీరిలో నుండి అత్యద్భుతమైన ఆటను ప్రదర్శించిన క్రీడాకారులను ఎంపిక చేసి ఈనెల 27 నుండి 30 వరకు హైదరాబాదులో నిర్వహించు రాష్ట్రస్థాయి సీఎం కప్ 2024 పోటీలకు పంపించనున్నట్లు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి పరందామ రెడ్డి, తెలిపారు. ఈ పోటీలో భాగంగా డివైఎస్ఓ ఆఫీస్ స్టాఫ్ తిరుమల రావు, లక్ష్మణ్, సీనియర్ బాస్కెట్ బాల్ క్రీడాకారులు పాల్గొన్నారు.
ముగిసిన బాస్కెట్ బాల్ జిల్లా జట్ల ఎంపికలు
RELATED ARTICLES