Tuesday, December 24, 2024

మిర్చి తోటలో గుర్తు తెలియని వ్యక్తులు కలుపు మందు స్ప్రే చేయడం వలన రైతుకు సుమారు పది లక్షల రూపాయల నష్టం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
7-12-2024

చండ్రుగొండ మండల పరిధిలో గల రావికంపాడు గ్రామంలో రైతు ఇమ్మడి శ్రీను మిర్చి తోటలో ఈర్ష్య భావంతో గుర్తు తెలియని వ్యక్తులు కలుపు మందు స్ప్రే చేయడం వలన సుమారు పది లక్షల రూపాయలు నష్టం జరిగింది. రైతు వ్యవసాయం కోసం అప్పులు తీసుకొచ్చి పంట పండించి అప్పులు తీర్చుకోవాలని ఆశతో మిర్చి తోటను జాగ్రత్తగా చూసుకుంటూ ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు ఈర్ష్య భావంతో  కలుపు మందు పిసికారి చేసి పంటను నష్టపరిచారు. నష్టపోయిన రైతు కుటుంబం ఇమ్మడి శ్రీను, లక్ష్మీ, లను ఆదుకోవాలని రైతు సంఘం నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఈ చర్యలకు పాల్పడిన వారిని పోలీస్ శాఖ కఠినంగా శిక్షించి మరొక రైతుకి ఇలా జరగకుండా ప్రభుత్వ అధికారులు బాధ్యత తీసుకోవాలని రైతులు కోరుచున్నారు. అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే, స్థానిక మంత్రులు, చొరవ చూపి పేద రైతును ఆదుకొని న్యాయం చేయాలని రైతు సంఘం నాయకులు అన్ని రాజకీయ పక్షాలు కలిపి విజ్ఞప్తి చేసినారు. చండ్రుగొండ మండల రైతు సంఘం నాయకులు అందరూ కలిసి స్థానిక ఎమ్మెల్యే ద్వారా జిల్లా మంత్రులను కలిసి రైతుకు న్యాయం చేయడానికి కృషి చేస్తామని రైతుకు మనోధైర్యాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో చంద్రుగొండ మాజీ జడ్పిటిసి కొనగళ్ళ వెంకటరెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ధారా బాబు, గుంపెన సహకార సంఘం వైస్ చైర్మన్ నల్లమోతు వెంకటనారాయణ, మాజీస్ సహకార సంఘం అధ్యక్షులు మేడ మోహన్రావు, కుంచపు కన్నయ్య, మల్లం వెంకటేశ్వర్లు, స్థానిక రైతులు గాలం రవి, ఇనుముల స్వామి, ఇమ్మడి రామారావు, జవ్వాజి నరసింహారావు , నరేష్, భూక్య రంగా, పెండ్యాల సైదులు, మద్దిరాల చిన్న పిచ్చయ్య, మెంతుల ముత్తయ్య, రామకృష్ణ, వేముల ప్రసాద్, మరియు కొందరు రైతులు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular