Friday, October 31, 2025

మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి కొత్తగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా గుంతలు పడ్డ రోడ్లను తక్షణమే బాగు చేయాలని డిమాండ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
కొత్తగూడెం:



బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు సూచనలతో నిరసన చేపట్టారు.

కొత్తగూడెం రైల్వే అండర్ బ్రిడ్జి, గోధుమ వాగు బ్రిడ్జి వద్ద జరిగిన ఈ నిరసనలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి ప్రజా సమస్యలపై కన్నా ఢిల్లీ రాజకీయాలపై ఎక్కువ దృష్టి పెడుతున్నారని విమర్శించారు.

22 నెలల కాంగ్రెస్ పాలనలో పాడైన రోడ్లకు శాశ్వత మరమ్మతులు జరగలేదని, తాత్కాలిక పూడికపనులతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు — మహిళలకు ₹2,500, తులం బంగారం, స్కూటీలు, పెన్షన్ల పెంపు, నిరుద్యోగులకు ఉద్యోగాలు వంటి హామీలు అమలు కాలేదని విమర్శించారు.

రోడ్లను తక్షణమే బాగు చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ విస్తృత ఆందోళనలు చేపడుతుందని హెచ్చరించారు.


ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular