యన్టీఆర్ జిల్ల నందిగామ మండలం మాగల్లు గ్రామం లో గల పశు వైధ్యశాల వద్ద స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేయలేదని నందిగామ మండల తహశీల్దార్ వారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది.
మాగల్లు గ్రామ పశు వైధ్యశాల లో జాతీయ జెండాను ఎగురవేయడం లో సంబంధిత శాఖ ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించారని లేఖ ద్వారా తెలియజేయడం జరిగింది.
జాతీయ జెండాను ఎగుర వేయకపోవడం తో మాగల్లు గ్రామ ప్రజలు, స్వాతంత్ర సమరయోధులు, మేధావులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని లేఖ ద్వారా తెలియజేయడం జరిగింది.
జాతీయ జెండా ఎగురవేయక పోవడం అనేది జాతీయ జెండాను అవమానించట మేనని, భారతదేశ సార్వ భౌమాధికారాని కి సంబంధించిన విషయమని స్థానిక ప్రజలు, స్వాతంత్ర సమరయోధులు ఆగ్రహం వ్యక్తం చేశారని లేఖ లో తెలియజేయడం జరిగింది.
ఈ విషయమై విచారణ చేసి బాధ్యులైన అధికారుల పై శాఖ పరమైన చర్యలు తీసుకొనే విధంగా చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ తెలియజేశారు.
మాగల్లు గ్రామ పశు వైధ్య శాల లో జాతీయ జెండా ఎగుర వేయలేదని తహశీల్దార్ వారికి ఫిర్యాదు
RELATED ARTICLES