స్వయం సహాయక మహిళా సంఘాలకు ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు*
సంగెం మండలం నల్లబెల్లి గ్రామంలో సోమవారం రోజు సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి అధికారులతో కలిసి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి స్థల పరిశీలన చేశారు. స్వయం సహాయక సంఘాలకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.ప్రభుత్వ భూములలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు స్థలాన్ని ఎంపిక చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో మహిళా సాధికారతే లక్ష్యంగా సోలార్ పవర్ ప్లాంట్ లు ఏర్పాటును ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తే ఎవరికి ఇబ్బంది ఉండదని,సోలార్ విద్యుత్తు అందుబాటులోకి వస్తే,పెద్ద ఎత్తున పంటలు సాగు చేసుకునే అవకాశం లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్కో డిస్టిక్ మేనేజర్ మహేందర్ రెడ్డి, మండల అధికారులు,మండల,కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చోల్లేటి మాధవరెడ్డి, కందకట్ల నరహరి, రమేష్, నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మహిళా సాధికారతే లక్ష్యంగా సోలార్ పవర్ ప్లాంట్
RELATED ARTICLES