Tuesday, September 16, 2025

మహానంది: ఉత్తమ ఉద్యోగులకు.. ఉత్తమ ప్రశంస పత్రాలు

నంద్యాల జిల్లా, మహానంది మండలంలో ఉత్తమ సేవా వార్డుల పండుగ నెలకొంది. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మండలంలోని మహానంది దేవస్థానం ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి, మహానంది పోలీస్ స్టేషన్ ఎస్సై ఎన్.రామ్మోహన్ రెడ్డి, విద్యుత్ శాఖ ఏఈ ప్రభాకర్ రెడ్డి, తహసిల్దార్ కార్యాలయం కంప్యూటర్ ఆపరేటర్ మణికంఠ, మహానంది -1 అంగన్వాడీ వర్కర్ P. పుష్పకళ కు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజకుమారి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు జ్ఞాపికలను అందుకున్నారు. రాష్ట్ర మంత్రి, జిల్లా కలెక్టర్ , చేతులమీదుగా అవార్డ్ అందుకోవడం పట్ల వీరికి పలువురు అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular