నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నియోజకవర్గం చాగలమర్రి గ్రామంలో గత 4 సంవత్సరాలుగా స్వచ్చందంగా నిస్వార్థ సేవ చేస్తున్నటువంటి అనాధ రక్షక్ సేవా ఫౌండేషన్ సంఘ సేవకులకు కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలోని మదర్ థెరిస్సా ఫౌండేషన్ వారు అంతర్జాతీయ స్వచ్ఛంద సేవకుల దినోత్సవం సందర్భంగా మథర్ థెరిస్సా సేవా రత్న పురస్కారం అందించారు. స్వచ్ఛందంగా సేవ చేసేటువంటి ప్రతి ఒక్కరిని అభినందించాలనే సంకల్పంతో గురువారం స్వచ్ఛంద సేవకులకు అవార్డ్స్ తో సత్కరించారు. ఈ సందర్భంగా అనాధ రక్షక్ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వల్లంకొండు సాయి సుదర్శన్ రావు సంఘ సేవకులు ఏపి ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయ ప్రతాపరెడ్డి , చిత్తా రవి ప్రకాష్ రెడ్డి , చిత్తా శేఖర్ రెడ్డి చేతుల మీదుగా మథర్ థెరిస్సా సేవారత్న అవార్డ్ అందుకోవడం జరిగినది. పురస్కారం అందుకున్న అనంతరం సాయి సుదర్శన్ రావు మాట్లాడుతూ ప్రతిఫలం ఆశించకుండా నిస్వార్ధంగా సేవ చేస్తూ సేవలో సంతోషాన్ని వెతుక్కుంటూ జీవనం సాగిస్తూ పెద్దలు తల్లితండ్రులు నేర్పిన మంచి మాటలు ఆచరిస్తూ ముందుకు సాగుతూ చాలా ఆనందంగా ఉందన్నారు.ఈ పురస్కారమే కాకుండా గతంలో కూడా చాలా పురస్కారాలు పలు రకాల స్వచ్ఛంద సంస్థల వారు పిలిచి సత్కరించారన్నారు. అవన్నీ కూడా జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఆధ్యాత్మికంగా విద్య నేర్పిన సద్గురువుల యొక్క గొప్పతనమని సాయి సుదర్శన్ రావు తెలిపారు.నాకు ఈ అవార్డ్ అందించిన చిత్తా రవిప్రకాష్ రెడ్డి గారికి ధన్యవాదములు తెలియజేశారు.అన్ని సేవలకన్నా ప్రముఖంగా మిగిలిన ఆహారాన్ని సేకరించి పంచడం ద్వారా చాలా మంచి పేరు వచ్చిందన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీ వినాయక ఫౌండేషన్ ,ఆత్మీయ సేవా ఫౌండేషన్ , మేము సైతం మీ కోసం స్వచ్చంద సంస్థతో పాటు పలు స్వచ్చంద సంస్థల యాజమానులు పాల్గొన్నారు.
మదర్ థెరిస్సా సేవారత్న అవార్డ్ అందుకున్న అనాధ రక్షక్ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వల్లంకొండు సాయి సుదర్శన్ రావు
RELATED ARTICLES