బడికి వెళ్లి వస్తానని బయలుదేరిన విద్యార్థిని రోడ్డు ప్రమాదానికి బలి యింది. చదువుకుందామని ఆటోలో బయలుదేరి అనంత లోకాలకు వెళ్ళిపోయింది. అదే ఆటోలో ప్రయాణిస్తున్న ఇతర విద్యార్థుల గాయాలతో ప్రాణాలు తప్పించుకోగా అనూష అనే పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని మృత్యుడికి చేరింది. వివరాలలోకెళ్ళితే
కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలోని సుంకేశ్వరి గ్రామానికి చెందిన విద్యార్థులు ఉన్నత పాఠశాలకు తమ గ్రామం నుంచి ఆటోలో బయలుదేరి వెళుతుండగా మార్గమధ్యంలో చౌలపల్లి గ్రామ సమీపంలో వారు ప్రయాణిస్తున్న ఆటోను వెనక వైపు నుంచి కర్ణాటక రాష్ట్రంలో చెందిన ట్రాలీ ఆటో ఢీకొనడంతో ఒక్కసారిగా విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటో బోల్తా పడింది అందులో ప్రయాణిస్తున్న అనసూయ ఆంజనేయ ఈరమ్మ అనే విద్యార్థులకు తీవ్ర గాయాలు కాగా పదవ తరగతి చదివే అనూష అనే విద్యార్థి అక్కడికక్కడే మృతి స్థానికులు విద్యార్థులను ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గంపెడు ఆశలతో తమ కుమార్తే చదువుతో తమ బ్రతుకులు మారుతాయని ఆశించిన వారి కుటుంబానికి విషాదం మిగిలింది. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
మంత్రాలయం మండలంలో దారుణం
RELATED ARTICLES