తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో, ఉమ్మడి ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్ కర్నాటి రామకృష్ణారెడ్డి పర్యవేక్షణలో మంగళ కైశిక (క్షీరాబ్ది) ద్వాదశి వ్రతాలు నవంబర్ 2వ తేదీన ఘనంగా నిర్వహించబడనున్నాయి.
ఈ వ్రతాలు చర్ల మండలం ఆర్.కొత్తగూడెం గ్రామంలో మరియు చండ్రుగొండ మండలం రావికంపాడు గ్రామంలో షెడ్యూల్డ్ కులాలకు చెందిన మిత అయ్యళ్వార్ (దాసుల) పురోహితుల ఆధ్వర్యంలో జరగనున్నాయి.
ఆర్.కొత్తగూడెం గ్రామంలో మిత అయ్యళ్వార్ పురోహితులు పందిళ్ళపల్లి వెంకటేశ్వర్లు, బీర రమణయ్య, సత్తీష్ తదితరులు వ్రత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
రావికంపాడు గ్రామంలో పూదూరి గోపాలకృష్ణ, గుర్రం వెంకటదాసు (పురోహితులు), తాళ్లూరి రాందాసు, గుర్రం బిక్షం దాస్ సమక్షంలో వ్రతాలు జరగనున్నాయి.
ఈ సందర్భంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ కోఆర్డినేటర్ కర్నాటి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ — “భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, స్వామివారి కృపకు పాత్రులు కావాలని” కోరారు.
మంగళ కైశిక (క్షీరాబ్ది) ద్వాదశి వ్రతాలు — నవంబర్ 2న
RELATED ARTICLES



