కొత్తగూడెం:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సిపిఐ నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యుల అభినందన సభ కొత్తగూడెం క్లబ్బులో ఘనంగా జరిగింది. ఈ సభకు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కోనమునేని సాంబశివరావు మాట్లాడుతూ, గెలిచినవారితో పాటు ఓడినవారినీ కలుపుకొని ప్రజలను మెప్పించే విధంగా పాలన సాగించాలని సూచించారు. నిస్వార్థ సేవ, పారదర్శక పాలనతో ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా ముందుకు సాగాలని అన్నారు.
గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి అనూహ్య విజయాలు సాధించిన సిపిఐ, ఓట్ల శాతం పరంగాను, మేజర్ పంచాయతీల గెలుపులోను అగ్రస్థానంలో నిలిచిందని ఆయన పేర్కొన్నారు. ఈ విజయానికి కారణమైన నూతన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను ఆయన అభినందించారు.
అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా మాట్లాడుతూ, సిపిఐ శత వసంతాల ముగింపు సందర్భంగా నిర్వహించనున్న భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సుమారు ఐదు లక్షల మందితో నిర్వహించనున్న ఈ బహిరంగ సభ విజయానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని కోరారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సిపిఐ నూతన సర్పంచులు, వార్డు సభ్యుల అభినందన సభ
RELATED ARTICLES



