Wednesday, March 12, 2025

భద్రాద్రి కొత్తగూడెంలో మిత అయ్యాల్వార్ సంఘం నిరసన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
8-2-2025



భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్‌లో, మిత అయ్యాల్వార్ సంఘం సభ్యులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, మెమోరాండం అందజేస్తూ తమ నిరసన తెలిపారు.

వీరి ప్రధాన డిమాండ్ ఏమిటంటే – ఎస్సీ వర్గీకరణలో చేసిన మార్పు వల్ల తమ హక్కులకు నష్టం జరుగుతోందని వారు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గాలను (A, B, C, D) గా విభజించగా, తాజాగా D గ్రూప్‌లో ఉన్న మిత అయ్యాల్వార్ కులాన్ని C గ్రూప్‌లోకి మార్చింది.

దీని ప్రభావంగా విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో తమకు అవకాశాలు తగ్గిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే మిత అయ్యాల్వార్ సంఘం తమను మళ్లీ (SC-D) గ్రూప్‌లోనే ఉంచాలని డిమాండ్ చేసింది.

ఈ నిరసన కార్యక్రమంలో మేక మోహన్ రావు, గుర్రం వెంకట దాసు, సుంకే వెంకటేశ్వర్లు, తాళ్లూరి రామదాసు, యర్నం శ్రీను, తోకల సందీప్, కోటపాటి సతీష్, తోకల శంకర్, తాళ్లూరి శివ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular