కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం నేపథ్యంలో భద్రాచలంలో ట్రావెల్ బస్సులపై మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ) వెంకట పుల్లయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా భద్రాచలం నుండి బయలుదేరే అన్ని ట్రావెల్ బస్సులను చెక్ చేశారు. అనుమతులు, ఫిట్‌నెస్ సర్టిఫికేట్‌లు, ఇన్సూరెన్స్, ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్‌లు వంటి రక్షణ చర్యలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
ప్రయాణికుల భద్రత దృష్ట్యా డ్రైవర్లు, బస్సు నిర్వాహకులు ఎల్లప్పుడూ జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రమాదాలు సంభవించినప్పుడు తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై ప్రయాణికులను అవగాహన కల్పించాలని ఎంవీఐ వెంకట పుల్లయ్య తెలిపారు.
తనిఖీలు నిరంతరంగా కొనసాగుతాయని, అనుమతులు లేని బస్సులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.
భద్రాచలంలో ట్రావెల్ బస్సులపై ఎంవీఐ ప్రత్యేక తనిఖీలు
RELATED ARTICLES



