తేజ న్యూస్ టివి ప్రతినిధి. సంగెం. 
బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని బిసి ప్రజాసంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వాసం సాంబయ్య అన్నారు.శనివారం రోజున స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పై హైకోర్టు స్టే ఇచ్చినందుకు నిరసనగా సంగెం మండల కేంద్రంలో బిసి ప్రజాసంఘం మండల అధ్యక్షుడు వేల్పుల అనిల్ యాదవ్ ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు హోటల్లు జూనియర్ కాలేజీలు ప్రయివేట్ విద్యాసంస్థలు స్కూళ్లు ప్రశాంతంగా బంద్ నిర్వహించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..బీసీలకి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలన్నారు.బీసీ జనాభా 56 శాతం ఉంటే కేవలం 42 శాతం రిజర్వేషన్లు కల్పించినా కూడా కొంత మంది ఓరువలేక పోతున్నారు ,కేవలం సర్పంచ్,ఎంపీటీసీ,వార్డు మెంబర్లకు కూడా ఓర్వకుండా కోర్ట్ లలో కేసులు వేస్తున్నారు అని అన్నారు, ఈ కార్యక్రమంలో బిసి ప్రజాసంఘం రాష్ట్ర కార్యదర్శి వాసం సురేష్,రాష్ట్ర సెక్రటరీ వీరేశం,మండల నాయకులు మద్దూరి ఈశ్వర్,రాజు,రమేష్,అనిల్,శ్రీకాంత్,మల్లేషం,విద్యార్థి నాయకులు,తదితరులు పాల్గొన్నారు.



 
                                    


