భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
కొత్తగూడెం:
తేదీ: 17-10-2025
స్ధలం: శేషగిరిభవన్, సీపీఐ జిల్లా కార్యాలయం
బీసీలకు 42% రిజర్వేషన్‌కు చట్టబద్ధత కల్పించి తక్షణమే అమలు చేయాలనే డిమాండ్‌తో రేపు (అక్టోబర్ 18న) జిల్లావ్యాప్తంగా బంద్ నిర్వహించనున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ ఎస్.కె. సాబీర్ పాషా తెలిపారు.
ఈ మేరకు శేషగిరిభవన్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీసీ వర్గాల సామాజిక న్యాయం కోసం సాగుతున్న పోరాటాన్ని ప్రభుత్వం పట్టించుకోవాలని, బీసీలకు న్యాయమైన వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ బంద్‌ను అన్ని వర్గాలు సమర్థించాలంటూ పిలుపునిచ్చారు.
సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, బీసీ సంఘాలు, మైనార్టీ సంఘాలు, సామాజిక సంస్థలు, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు పాల్గొని తమ మద్దతు ప్రకటించారు.
బంద్‌ను జయప్రదం చేయాలని, ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని నాయకులు కోరారు.
బీసీలకు 42% రిజర్వేషన్‌కు చట్టబద్ధత కల్పించి తక్షణమే అమలు చేయాలనే డిమాండ్ – జిల్లా బంద్ కు పిలుపు
RELATED ARTICLES



