కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో, మండలానికి సంబంధించిన అన్ని విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కామారెడ్డి శాసన సభ్యులు *కాటిపల్లి వెంకట రమణ రెడ్డి* అధ్యక్షత వహించారు.
సమావేశంలో ఆరోగ్య శాఖ ANMలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ సూపర్వైసర్లు, వ్యవసాయ శాఖ AOలు, AEOలు, సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ వార్డెన్లు, ఉపాధి హామీ పథకం APOలు, TAలు, FAలు, MPOలు, పంచాయతీ కార్యదర్శులు, విద్యా శాఖ MEOలు, MRPలు, పశు సంవర్ధక శాఖ వైద్యులు, పంచాయతీ రాజ్, విద్యుత్, రోడ్లు–భవనాల శాఖ, హౌసింగ్ శాఖ AEలు, అటవీ శాఖ అధికారులు, పోలీస్ ఇన్స్పెక్టర్, ఫిషరీస్ ఫీల్డ్ అసిస్టెంట్, ఇందిరా క్రాంతి పథకం APMలు, CCలు, మండల రెవెన్యూ అధికారి, RIలు, సర్వేయర్లు, ఎక్సైజ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఎంఎల్‌ఏ రమణ రెడ్డి వివిధ శాఖల పనితీరు, ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల అమలు అంశాలపై విభాగాల వారీగా సమీక్ష చేపట్టారు.
బీబీపేటలో విభాగాల వారీగా సమీక్షా సమావేశం
RELATED ARTICLES



