భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
పాల్వంచ మండలం
తప్పుడు ప్రచారాలను, వదంతులను నమ్మొద్దు – వనమా బిజెపిలో చేరతానన్న వార్తలు నిరాధారమై ఖండన
పాల్వంచ, సెప్టెంబర్ 8:
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలోనే తన రాజకీయ ప్రయాణం కొనసాగుతుందని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు.
కొంతమంది ప్రచారం చేస్తున్న “వనమా బిజెపిలో చేరతారు” అన్న వార్తలు పూర్తిగా తప్పుడు వదంతులేనని ఆయన ఖండించారు. “కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నా, లేకున్నా నేను ఎప్పటికీ బీఆర్ఎస్‌లోనే ఉంటాను. మా కుటుంబం బీఆర్ఎస్ నాయకత్వానికే కట్టుబడి ఉంది” అని వనమా స్పష్టం చేశారు.
తాను కాంగ్రెస్ పార్టీలో నాలుగు దశాబ్దాలకుపైగా పనిచేసినప్పటికీ, తెలంగాణ సాధన తర్వాత కేసీఆర్ పిలుపుతోనే బీఆర్ఎస్‌లో చేరానని గుర్తుచేశారు. “కేసీఆర్, కేటీఆర్‌లు చూపిన దారిలోనే భవిష్యత్తులో కూడా పనిచేస్తాను” అని వనమా స్పష్టం చేశారు.
బీఆర్ఎస్‌తోనే వనమా
కుటుంబం – మాజీ మంత్రి వనమా స్పష్టం
RELATED ARTICLES