గాంధీ జయంతి సందర్భంగా బిబీపేట్ మండలంలోని అన్ని గ్రామపంచాయతీల నందు ప్రత్యేక గ్రామసభలు చేయడం జరిగింది. ఈ గ్రామ సభల్లో గత 15 రోజుల నుండి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాలు, సానిటేషన్ , దసరా, బతుకమ్మ పండుగ సందర్భంగా గ్రామ అభివృద్ధి అయినటువంటి జిపిడిపి యాక్షన్ ప్లాన్ ఉపాధి హామీ కింద రాబోయే 2024 25 సంవత్సరానికి గాను అగ్రికల్చర్ లేదా వ్యక్తిగత పనులు గుర్తించాలని అలాగే ఇండివిజల్ సోప్ పెట్ కామన్ సోప్ హరితహారం ఇతర కార్యక్రమాలను కూడా గుర్తించడం జరిగింది. దీనిలో భాగంగా గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులకు చెప్పులు జతలు సర్ఫ్ సబ్బులు చెల్లించడం జరిగింది. అలాగే బతుకమ్మ దసరా సందర్భంగా అన్ని చెరువుల దగ్గర క్లీన్ చేయాల్సిందిగా ఆదేశాలు జారి చేయడమైనది ఇటు గ్రామ సభల్లో గ్రామ ప్రత్యేక అధికారులు పంచాయతీ సెక్రటరీలు ఇతర లైన్ డిపార్ట్మెంట్లు హాజరైనారు.
బిబీపేట్ మండలంలోని అన్ని గ్రామపంచాయతీల నందు ప్రత్యేక గ్రామసభలు
RELATED ARTICLES