TEJA NEWS TV: కామారెడ్డి జిల్లా బిబిపేట మండల కేంద్రంలో గల, (కస్తూర్బా బాలికల హాస్టల్) నందు. ఈరోజు” సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ,2005″ బిబిపేట కమిటీ ఆధ్వర్యంలో, అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి రాష్ట్ర సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ రాష్ట్ర డైరెక్టర్,& మాజీ న్యాయమూర్తి M.A. సలీం ,గారు ముఖ్యఅతిథిగా విచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలి అని, చదువుతో పాటుగా చట్టాలను గురించి తెలుసుకోవాలని, చట్టాల పట్ల గౌరవంగా ఉండాలని అన్నారు.RTI. బిబిపేట మండల అధ్యక్షులు నాంపల్లి గారు మాట్లాడుతూ, చదువు నేర్చుకోవడం ఎంత ముఖ్యమో చట్టాల గూర్చి తెలుసుకోవడం అంతే ముఖ్యమని. ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోరాదని, విద్యార్థినులకు వివరించారు. ప్రిన్సిపాల్ గారు మాట్లాడుతూ ఇంత మంచి కార్యక్రమాన్ని మా హాస్టల్ లో, నిర్వహించినందుకు, ధన్యవాదాలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో జోనల్ కమిటీ మెంబర్ సంతోష్ కుమార్. కమిటీ కార్యదర్శి పండ్ల హనుమంతు. హెడ్ కానిస్టేబుల్ మల్లేశం గారు. ఉపాధ్యాయ బృందం అధిక సంఖ్యలో, విద్యార్థినిలు, పాల్గొని ఈయొక్క అవగాహన సదస్సును, విజయవంతం చేశారు.
బిబి పేట్ :సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ,2005″ బిబిపేట కమిటీ ఆధ్వర్యంలో, అవగాహన సదస్సు
RELATED ARTICLES