కామారెడ్డి జిల్లా బిబిపేట మండలంలో తొట్టెల ఊరేగింపు వేడుకను రేపు సాయంత్రం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మండలంలో ఇదే మొదటిసారి తొట్టెల ఊరేగింపు జరగనుండటంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు.
సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు పోతరాజులు, డీజే సప్పు, డమ్ము తదితర సాంస్కృతిక కార్యక్రమాలతో ఊరేగింపు జరగనుంది. ఊరేగింపులో అన్ని కులాల యువత కలిసి పాల్గొనడంతో ఊరేగింపు మరింత వైభవంగా మారనుంది.
ఈ సందర్భంగా గ్రామస్తులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి, వాహన పార్కింగ్, రహదారి భద్రత, శుభ్రత తదితర సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు, ప్రజలు రావడంతో గ్రామంలో ఉత్సవ శోభ నెలకొంటుంది..
బిబిపేట మండలంలో తొట్టెల ఊరేగింపు – భారీ ఏర్పాట్లు
RELATED ARTICLES