కామారెడ్డి జిల్లా: మాచారెడ్డి సెక్షన్ విద్యుత్ కార్యాలయంలో, ట్రాన్స్ఫర్ పై వచ్చి నూతన పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి, (డి ఈ) కళ్యాణ్ చక్రవర్తిని, (ఏ. ఈ)తిరుపతి రెడ్డిని,మాచ రెడ్డి విద్యుత్తు సబ్ డివిజన్ ఆర్టిజన్లు, శాలువాలతో, పూలమాలతో, ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డివిజనల్ ఇంజనీర్ మాట్లాడుతూ, ఆర్టిజన్ లందరూ కలిసి సన్మానించడం సంతోషంగా ఉందని, ఇదే స్ఫూర్తితో సంస్థను, అభివృద్ధి బాటలో ముందుకు నడపాలని అన్నారు. (ఏ.ఈ) తిరుపతిరెడ్డి మాట్లాడుతూ, విద్యుత్ ఆర్టిజన్ల సన్మానం సంతోషంగా ఉందని, ప్రతి ఆర్టిజన్ సేఫ్టీ ప్రికాషన్స్ పాటిస్తూ, మీ మీ సబ్ స్టేషన్లలో మీయొక్క డ్యూటీ లను సేఫ్టీగా చేయాలని సూచించారు. అటు ప్రజలతో, ఇటు అధికారులతో, మమేకమై, మనమందరం ఒక కుటుంబం లాగా సేవలందించాలని వారన్నారు. చేసిన సేవ మంచితనం కలకాలం ప్రజల్లో గుర్తుండిపోతాయని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. ఇట్టి సన్మాన కార్యక్రమంలో,కామారెడ్డి జిల్లా ఆర్టిజన్ యూనియన్, సీనియర్ అడ్వైజర్ నాంపల్లి, సునీల్,వెంకటేష్, సద్దిరాజిరెడ్డి, బి. రాజేందర్, కే బాలేశం, లతోపాటు ఆర్టిజన్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
బిబిపేట్ మండల్.విద్యుత్ శాఖ (డి.ఈ) మరియు (ఏ.ఈ) లకు ఘన సన్మానం
RELATED ARTICLES