TEJA NEWS TV
బీబీపేట్ మండలంలోని మాందాపుర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న 42 మంది విద్యార్థులకు నెల రోజుల పాటు తన సొంత డబ్బులతో అల్పాహారం అందించే కార్యక్రమాన్ని మండల మాజీ రైతుబంధు సమితి అధ్యక్షులు,సామాజికవేత్త అంకన్నగారి నాగరాజ్ గౌడ్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు బోధించే పాఠాలు శ్రద్ధగా విని కష్టపడి చదివి రాబోయే పరీక్షలకు సిద్ధం కావాలని మంచి ఫలితాలు సాధించాలని అయన కోరారు ఉత్తమ ఫలితాలు సాధించాలని 10 వ తరగతి విద్యార్థులకు సాయంత్రం పూట ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న తరుణంలో విద్యార్థులు పరీక్షల విషయంలో ఎలాంటి భయాందోళన చెందకుండా ఏకాగ్రతతో ప్రణాళిక ప్రకారం చదువుకోవాలన్నారు విద్యార్థుల ఆరోగ్యం పరిరక్షించేందుకు,విద్యార్థులు చదువు పై దృష్టి నిలిపేందుకు ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనపర్చడానికి సాయంత్రం వేళ అల్పాహారం అందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు ప్రధానోపాధ్యాయులు సారయ్య మాట్లాడుతూ స్కూల్ లో పదవ తరగతి చదువుతున్న 42 మంది విద్యార్థులకు నాగరాజ్ గౌడ్ తన సొంత డబ్బులతో అల్పాహారం అందిస్తానని ముందుకురావడం అభినందనీయమన్నారు ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్, వహీద్, పవన్, కృష్ణ, విజయానంద్,సులోచన, బాబు, రామారావు, శ్యామ్ పాల్గొన్నారు
బిబిపేట్: పదవతరగతి విధ్యార్థులకు అల్పాహారం అందజేత
RELATED ARTICLES