TEJA NEWS TV TELANGANA :కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండలంలో ఇటీవల కురిసిన వర్షాలతో రైతుల్లో ఆనందం వెల్లువెత్తింది. ముఖ్యంగా మొక్కజొన్న సాగుకు ఇది ఎంతో అనుకూలమని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంటల వృద్ధికి ఇది ఉత్తమ సమయమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ కొరివి నర్సింలు మాట్లాడుతూ — “ఇలాగే వర్షాలు పడితే రైతులకు మంచి లాభాలున్నాయి. ముఖ్యంగా వరి పంటల కోసం కూడా ఇది సమయానుకూల వర్షం. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఎరువులు, విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలి” అన్నారు.
వర్షాలు లేకపోతే పంటలు నష్టమవుతాయని, ఈసారి సరైన సమయంలో వర్షాలు రావడం వల్ల పంటలు విజయవంతంగా సాగుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు.
బిబిపేట్‌లో వర్షాలు…రైతుల్లో ఆనందోత్సాహం!
RELATED ARTICLES