TEJA NEWS TV TELANGANA: కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండలంలో, గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద పింఛన్ల పంపిణీలో గందరగోళం నెలకొంది. తొమ్మిది వందలకి పైగా పింఛన్ల కోసం వందల సంఖ్యలో మహిళలు మూడు రోజులుగా తిరుగుతున్నా, ఒక్కే ఒక్క సిస్టం ఉండడంతో పింఛన్లు ఇవ్వడంలో జాప్యం అవుతోంది.
ఈ పరిస్థితిపై మాజీ ఎంపీటీసీ కొరివి నర్సింలు స్పందిస్తూ – “ఒక్క సిస్టంతో కాదు, నాలుగు సిస్టంలు, ప్రత్యేక భవనం ఏర్పాటు చేయాలి. ఇంత బీటల తిరుగుడు వల్ల కూలికి వెళ్లే వారికీ నష్టమే. ఒంటరి మహిళలు, వికలాంగులకు మరింత ఇబ్బంది. ప్రభుత్వం వెంటనే స్పందించాలి” అంటూ డిమాండ్ చేశారు.
పట్టణ ప్రజలు, మహిళలు, వృద్ధులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ పింఛన్ల పంపిణీని వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
బిబిపేట్‌లో పింఛన్ల ఇబ్బందులు…మహిళల ఆగ్రహం
RELATED ARTICLES