తేజ న్యూస్ టివి ప్రతినిధి, సంగెం.
కార్యకర్తలను కంటికిరెప్పలా కాపాడుకుంటానని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు.శుక్రవారం రోజు సంగెం మండలం మొండ్రాయి, నర్సానగర్ గ్రామాలలో ఇటీవలే వివిధ కారణాలతో మృతిచెందిన ఇండ్ల మల్లయ్య, పరికి గట్టమ్మ,ఓదెల కుమారస్వామి కుటుంబాలను వారు పరామర్శించారు.
*రాజాలు విగ్రహాన్ని ఆవిష్కరించారు
గత సంవత్సరం మృతిచెందిన గొల్లపల్లి వాస్తవ్యులు ఎల్లబోయిన రాజాలు ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబసభ్యులు ఏర్పాటుచేసిన ఆయన విగ్రహాన్ని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి బిఆర్ఎస్ కలిసి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా రాజాలు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో
మాజీ ఎమ్మెల్యే వెంట పరామర్శించిన వారిలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు ఉన్నారు.
బిఆర్ ఎస్ కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటా..పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
RELATED ARTICLES



