TEJA NEWS TV
శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలం ఎస్.రాయపురం గ్రామంలో స్థానిక ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆర్.డి.టి మరియు మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుడిబండ ప్రాజెక్ట్ మహిళా శిశు అభివృద్ధి పథక అధికారిణి డాక్టర్ జి.శాంతలక్ష్మి హాజరైనారు.
సి డి పి ఓ డాక్టర్ జి.శాంతలక్ష్మి మాట్లాడుతూ బాల్య వివాహాలు లేని మండలముగా గుడిబండ మండలాన్ని తయారు చేయడానికి ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని కోరుతూ తల్లిదండ్రులు చిన్న వయసులో వివాహాలు చేయడం వల్ల అమ్మాయిలు మానశిక, శారీరక ఒత్తిడికి గురి కావడం మరియు ప్రసవ సమయంలో తల్లి బిడ్డ ప్రాణాలు కోల్పోతారని తెలుపుతూ ఆడ పిల్లలకు 18 సంవత్సరాలు మగ పిల్లలకు 21 సంవత్సరాలు నిండిన తరువాత వివాహ ప్రయత్నాలు చేయడం ఉత్తమము అని తెలియజేశారు. అలా కాకుండా బాల్య వివాహం చేయాలని చూస్తే బాల్య వివాహ నిరోధక చట్టం 2006 ప్రకారం బాల్య వివాహాo చేసుకున్న, నిర్వహించిన,సహకరించిన మరియు హాజరైన ప్రతి ఒక్కరూ శిక్షార్హులు ఇందుకు గాను రెండు సంవత్సరాలు జైలు శిక్ష లేదా లక్ష రూపాయలు జరిమానా లేదా రెండు విదింప బడుతాయి మరియు లైంగిక నేరాలనుండి బాలలకు రక్షణ చట్టం,2012 కుడా వర్తిస్తుందని తెలియజేస్తూ ఎక్కడైనా బాల్య వివాహాలు చేయాలని ప్రయత్నిస్తుంటే వెంటనే టోల్ ప్రీ నంబర్లు 1098 మరియు 100 లకు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటారని తెలియజేసినారు.
ఆర్ డి టి మహిళా అభివృద్ధి విభాగం టీం లీడర్ ఆదినారాయణ మాట్లాడుతూ బాలలు మన జాతీయ సంపద వారిని కాపాడవలసిన భాద్యత ప్రతి ఒక్కరిది అలాగే బాలలు కుడా తమ హక్కులను మరియు భాధ్యతలను తెలుసుకొని నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టుగా భవిషత్తు లో ప్రతి ఒక్కరు అత్యన్నత స్థాయికి ఎదగాలని తెలుపుతూ అమ్మాయిలు అవకాశాలను అందిపుచ్చుకోవాలని అలాగే ప్రస్తుత సమాజంలో ఎదురైయ్యే సమస్యల పట్ల అవగాహన కలిగి ఉండాలని అలాగే తల్లిదండ్రులు పుట్టుక నుండే అబ్బాయి ని ఒక విదంగా అమ్మాయి ని ఒక విదంగా చుసేవిధానం రూపుమాపి సమాన అవకాశాలు అందించాలి మరియు వారసులు అంటే అబ్బాయిలు మాత్రమే కాదు అమ్మాయిలు కుడా అని తెలియజేసినారు అంతే కాకుండా ఆర్ డి టి సంస్థ బాలల హక్కుల పరిరక్షణ కోసం ముందస్తు చర్యగా అన్ని ప్రాంతాలలో అవగాహన కార్యక్రమాలని ఏర్పాటు చేసి పిల్లలకు మరియు తల్లిదండ్రులకు ప్రస్తుత సమాజంలో పిల్లలకున్న సమస్యల పట్ల అవగాహన కల్పిస్తున్నామని తెలిపినారు.
ఈ కార్యక్రమంలో ఆర్ డి టి మహిళా అభివృద్ధి విభాగం టీం లీడర్ ఆదినారాయణ, ప్రదానోపాధ్యాయులు రామమూర్తి,ఐ సి డి ఎస్ సూపర్వైజర్ కమలమ్మ, అంగనవాడి కార్యకర్తలు లలిత,నరసమ్మ,ఇందిరమ్మ మరియు చిన్నారులు పాల్గొన్నారు.
బాల్య వివాహాలు అరికడదాం- బాల్యాన్ని రక్షిద్దాం…శ్రీ సత్య సాయి జిల్లాను బాలల స్నేహ జిల్లా గా ఏర్పాటు చేయుటకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి
RELATED ARTICLES