TEJA NEWS TV:
ఎందుకు నిర్లక్ష్యం…?
బస్సులు లేక ప్రయాణికుల ఇబ్బంది.
చేసేది ఏమీ లేదంటున్న అధికారులు
ప్రజల చేత ప్రజల కొరకు ప్రజా పాలన ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం పాలన వారికి ఎన్నుకున్న ప్రజలకు శాపంగా మారింది. హొళగుంద మండలంలో నుండి ప్రతి పల్లెటూరికి వెళ్లాలంటే బస్సులు లేక చాలా ఇబ్బందికరంగా మారింది. హెబ్బటం హొళగుంద మీదుగా బస్సులు రాకపోకలు బంద్ అయ్యాయి. రోడ్డులో గుంతల గుంతలు పడటంతో ఆర్టీసీ బస్సులు నిలిపివేశారు. అందుకోసం ఆదోని ఆలూరు మీదుగా ఎల్లార్తి హొళగుంద మీదుగా బస్సులు వస్తున్నాయి. అయితే ఇలాగైతే సమస్యలు తలెత్తుతాయి హొళగుంద లో ప్రభుత్వ ఆసుపత్రి ఉంది.పక్కన ఉండే పల్లెటూరు నుండి ఎంతోమందిప్రజలు ప్రభుత్వ ఆస్పత్రి కి వస్తుంటారు. గర్భవతులు బాలింతలు అనేకమంది వస్తుంటారు. అర్జెంటుగా వెళ్లాలంటే ప్రభుత్వ ఆసుపత్రి నుండి 108 వాహనము ద్వారా ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలి. అయితే ఎల్లార్తి ఆలూరు మీదుగా ఆదోని వెళ్లాలంటే చాలా దూరం అవుతుంది.హొళగుంద టూ హెబ్బటం ఆదోని రోడ్డు పరిస్థితి గుంతల గుంతలుగా మారిపోయింది. ఇది అందరి సమస్య అని ప్రజలు మరియు అధికారులు వెంటనే స్పందించి మరమత్తు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
బస్సులు నిలిపివేస్తామని సమాచారం ఇచ్చిన పట్టించుకోని పాలకులు
RELATED ARTICLES