TEJA NEWS TV (బనగానపల్లె )
నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణం కొండపేటలో నివాసం ఉంటున్న బిజెపి మండల అధ్యక్షులు బచ్చు శరత్ చంద్ర ఇంటిపై కొందరు వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. శరత్చంద్ర తోపాటు అతని తల్లిపై దాడి చేసి ఇంట్లోనే వస్తువులు బయటకు విసిరేశారు.ఇల్లు తమదే నంటూ ఇంటిలోని ఫర్నిచర్ బయటికి విసిరి బలవంతంగా ఇంటికి తాళం వేశారు.వైసిపి నాయకుడు మిట్టపల్లె వెంకటరమణ తో పాటు అతని అనుచరులు ఈ దాడి లో పాల్గొన్నారు.దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేయాల్సిన పోలీసులు రాజకీయ ఒత్తిళ్లతో ఇరువర్గ లపై కేసు నమోదు చేశాడని బాధితుడు శరత్ చంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి పార్టీ మండల కన్వీనర్ పై దాడి విషయం తెలుసుకున్న నంద్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి బనగానపల్లె కు చేరుకుని బాధితులు శరత్ చంద్రను పరామర్శించారు… అనంతరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి బాధితునికి న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.అనంతరం బాధితుడు శరత్ చంద్ర తో కలిసి జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డిని ఆశ్రయించి న్యాయం చేయాలని కోరారు.ఈ ఘటనపై ఇరువర్గాలపై కేసు నమోదు చేసుకున్న బనగానపల్లె పోలీసులు దర్యాప్తు చేపట్టారు