బడ్జెట్లో ఉపాధి హామీ చట్టానికి రెండు లక్షల కోట్ల రూపాయలను కేటాయించాలని 200.రోజులు పని దినాలు కల్పించాలని 600 రూపాయల వేతనం ఇవ్వాలని ఆన్లైన్ మాస్టర్ విధానాన్ని తొలగించాలని రెండు పూటల పని పద్ధతిని తీసివేయాలని ఉపాధి కూలీలను ఆధార్ తో సంధానం చేయరాదని వారం వారం ఉపాధి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం పిలుపులో భాగంగా కోసిగి మండల ఏపీఓ కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కోసిగి మండల కార్యదర్శి కె.వీరేష్ వ్యవసాయ కార్మిక సంఘం కోసిగి మండల కార్యదర్శి నాగేంద్ర మాట్లాడుతూ ఈ సంవత్సరం సరైన వర్షాలు లేక సెప్టెంబర్ లోనే వలసలు ప్రారంభించారని ఇక్కడ వలసలు నివారించాలంటే తక్షణం అడిగిన ప్రతి ఒక్కరికి పని కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు జక్కుల మరియమ్మ చిట్టెమ్మ నాగేంద్రమ్మ సిద్ధమ్మ శంకరమ్మ రమాదేవి భాగ్యమ్మ పెద్ద మునెమ్మ ఆటో చిన్నన్న తిమ్మప్ప లక్ష్మన్న ముక్రయ్య వెంకటేశులు అనిమేష్ తదితరులు పాల్గొన్నారు.
బడ్జెట్లో ఉపాధి చట్టానికి రెండు లక్షల కోట్ల కేటాయించాలి
RELATED ARTICLES