TEJA NEWS TV
హొళగుంద మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉద్యమ పోస్టర్ లను ఆవిష్కరించి ప్రసంగించిన బహుజన ఉద్యమ నాయకులు చిన్నహ్యట శేషగిరి మాట్లాడుతూ అణగారిన వర్గాల ఆత్మబంధువు జాతీయ స్థాయిలో మాన్యశ్రీ అంబేద్కర్, కాన్షీరామ్ ల తర్వాత అంతటి ఖ్యాతి గాంచిన బహుజన విప్లవయోధుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ సకల వర్గాల సమిష్టి సాధికారతకు పీడితుల గొంతుకై, దశాబ్దాల కాలం నుంచి సుధీర్గంగా దళిత బహుజనుల ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారతకై సలపిన ఎ.బి.సి.డి వర్గీకరణ పోరాటంలో భాగంగా ఫిబ్రవరి 7 న హలో మాదిగ-చలో హైదరాబాద్ అంటూ తలపెట్టిన లక్షడప్పులు వేలగొంతులు ఉద్యమానికై తరలిరావాలని పిలుపునిచ్చారు. సీనియర్ నేత చిదానంద, యువనాయకులు కెంచప్ప, మల్లికార్జున తదితరులు మాట్లాడుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి గొడుగున జాతీయ స్థాయిలో దళితుల ఆత్మగౌరవ పతాకమై ఉజ్వలిస్తున్న ఎమ్మార్పియస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణన్న ఉద్యమ సారథ్యంలో ఎ.బి.సి.డి వర్గీకరణ సాధించి తీరుతామన్నారు. ఈ విప్లవ పోరాటంలో మాదిగలు మూకుమ్మదిగా లక్షడప్పులు-వేలగొంతులు ఉద్యమానికై పెద్దఎత్తున తరలివచ్చి ఉద్యమాన్ని దిగ్విజయం చేయాలని అందుకై హెుళగుంద నుండి రవాణా సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అంబేద్కర్ విగ్రహ ఆవరణంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఎమ్మార్పియస్ మరియు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు పకిరప్ప, దేవప్ప, కన్నారావు, భీమయ్య, గోవర్ధన్, చిదానంద, భాస్కర్ తదితరుల నాయకులు యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఫిబ్రవరి 7న హలో మాదిగ చలో హైదరాబాద్ పద్మశ్రీ మందకృష్ణ లక్ష డప్పులు వేల గొంతులు ఉద్యమానికై తరలిరండి
RELATED ARTICLES