తమిళనాడు – ధర్మపురి జిల్లాలోని కీరైపట్టి గ్రామానికి చెందిన రసూల్(35)కు అమ్ముబీతో కొన్నేళ్ల క్రితం పెళ్లి కాగా, వారికి ఇద్దరు పిల్లలున్నారు
రసూల్ డ్రైవర్ గా పని చేస్తుండగా, అమ్మూబీ ఇంట్లో ఉంటూ స్థానికంగా సెలూన్ నడుపుతున్న లోకేశ్వరన్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది
లోకేశ్వరన్‌తో కలిసి ఉండడానికి నిర్ణయించుకున్న అమ్మూబీ, ఎలాగైనా భర్త అడ్డు తొలగించడానికి కొన్ని రోజుల క్రితం మొదట దానిమ్మ రసంలో విషం కలిపి ఇచ్చింది
రసూల్ అది తాగకపోయే సరికి, తర్వాత సాంబారులో విషం కలిపి వడ్డించింది.. దీంతో రసూల్ వాంతులు చేసుకొని, స్పృహ కోల్పోగా, కుటుంబీకులు హుటాహుటిన సేలంలోని ఓ ఆసుపత్రిలో చేర్చారు
రసూల్ రక్త నమూనాలు పరిశీలించిన డాక్టర్లు పురుగుమందు తీసుకున్నారు తెలిపారు.. దీంతో అనుమానం వచ్చి భార్యను నిలదీయగా పొంతన లేని సమాధానాలు చెప్పింది
అనుమానంతో ఆమె ఫోన్‌లోని వాట్సప్ చాటింగ్‌ను చూడగా అమ్మూబీ, లోకేశ్వరన్‌తో వేసుకున్న పథకం తెలిసింది.. ఆసుపత్రిలో కొన్ని రోజులు చికిత్స పొంది రసూల్ చనిపోయాడు
కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అమ్ముబీ, లోకేశ్వరన్‌లను అరెస్టు చేశారు
ప్రియుడి కోసం సాంబారులో విషం పెట్టి భర్తను చంపిన భార్య
RELATED ARTICLES


 
                                    


