
తేజ న్యూస్ టివి ప్రతినిధి, సంగెం. 
 సంగెం మండల కేంద్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కై రాష్ట్రవ్యాప్తంగా బందు పిలుపుమేరకు మండలం
 లో బ్యాంక్ లు, కాలేజీ లు షాపులు ముందు ప్రజా సంఘాలు వివిధ రాజకీయ పార్టీల నాయకులు అందరూ పాల్గొని బందు కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో చురుకుగా పాల్గొనడం  సంతోషమని బీసీ ఉద్యమాన్ని మునుముందుకు తీసుకెళ్లడంలో బీసీ బిడ్డలుగా ప్రతి ఒక్కరు కంకణ బద్ధులై ఉండాలని  అన్నారు 
ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా సోయి తెచ్చుకొని బిసి 42 శాతం రిజర్వేషన్ వెంటనే స్పందించి అమలు చేయాలని కోరారు డిమాండ్ చేశారు, 
కార్యక్రమంలో సంగెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చోల్లెటి మాధవరెడ్డి,మండల ముఖ్య నాయకులు కందకట్ల నరహరి,ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మెట్టపల్లి రమేష్, నాయకులు, పాషా, తదితరులు పాల్గొన్నారు.


 
                                    


